వందలాది మందితో పవన్ వీరోచిత పోరాటం !

Published on Apr 11, 2022 9:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘హరి హర వీరమల్లు’. కాగా ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌ లో చిత్రీకరణ జరుగుతోంది. తోట తరణి ఆధ్వర్యంలో వందలాది మంది ఫైటర్లతో ఓ వీరోచిత పోరాటంతో ఈ యాక్షన్ షెడ్యూల్ ను షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రత్యేకమైన సెట్స్ రూపొందించి మరీ షూట్ చేస్తున్నారు.

పైగా ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం విదేశీ నిపుణులు కూడా పని చేయడం విశేషం. ఇక ఈ యాక్షన్ షెడ్యూల్ కోసం సంబంధించి చిత్రబృందం ఓ ప్రత్యేకమైన వీడియోను కూడా రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతుంది. ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ పాన్‌ ఇండియా సినిమా రాబోతుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :