పవన్ కళ్యాణ్ ఆ స్టార్ హీరో సినిమాకి ఫిదా అయిపోయాడు !
Published on Jan 1, 2017 4:15 pm IST

pawan
పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర స్థాయి నటుడైనప్పటికీ వీలైనంత వరకు సినిమా వాతావరణానికి దూరంగానే ఉంటారు. ఎక్కడా సినిమాల గురించి పెద్దగా ప్రస్తావించారు. అలాంటి ఆయన మొట్ట మొదటిసారి ఒక సినిమా గురించి మాట్లాడారు. మాట్లాడటమంటే అలా ఇలా కాదు ఆ సినిమాని, అందులో హీరోని పొగడ్తలతో ముంచెత్తాడు. ఆ సినిమానే అమీర్ ఖాన్ నటించితిన్ ‘దంగల్’. ఈ మధ్యే రిలీజైనా ఈ బాలీవుడ్ సినిమా దేశవ్యాప్తంగా సంచలనాలు క్రియేట్ చేస్తోంది. భారత మల్ల యుద్ధ యోధుడు మహావీర్ సింగ్ ఫోగట్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా గురించి పవన్ మాట్లాడుతూ ‘దంగల్ చిత్రానికి గాను అమీర్ ఖాన్, ఆయన టీమ్ కు నా హృదయపూర్వక అభినందనలు. సినిమా చూసిన దగ్గర్నుంచి నేను అనుకున్నది చెప్పేయాలని నా మనస్సాక్షి నన్ను ప్రేరేపించింది. అమీర్ ఖాన్ గొప్ప నటనతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. అలాంటి గొప్ప నాటుడున్నందుకు మన దేశం గర్వపడాలి. దర్శకుడు నితీష్ తివారికి ఇతర కాస్ట్ అండ్ క్రూ కు నా శుభాకాంక్షలు. ఈ చిత్రం మన దేశంలో కరువైన మహిళా సాధికారతను గుర్తించాలని, ఆ దిశగా కృషి చేయాలని చెప్తోంది’ అన్నారు. ఇలా పవన్ ఒక్కసారి దానాలు సినిమాని పొగడటంతో అందరూ ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యారు.

 
Like us on Facebook