ఫుల్ ఎనర్జిటిక్ గా పవన్, సాయి తేజ్ ల “బ్రో” ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్.!

Published on May 18, 2023 4:27 pm IST

ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అంతా కూడా తమ అభిమాన హీరోల సక్సెస్ లు అలాగే వరుసగా వారి చిత్రాల సాలిడ్ అప్డేట్స్ అయితే సూపర్ హ్యాపీ గా ఉన్నారు. రీసెంట్ గానే సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన యాక్సిడెంట్ నుంచి కోలుకున్న రిలీజ్ కి వచ్చిన “విరూపాక్ష” స్ట్రాంగెస్ట్ కం బ్యాక్ ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత కూడా తన మామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి చేసే చిత్రంతో కూడా అందుకుంటానని ఇది వరకే నమ్మకంగా చెప్పాడు.

మరి ఈ సాలిడ్ ప్రాజెక్ట్ పై అయితే గా ఎదురు చూస్తున్న సూపర్ డూపర్ అప్డేట్ ని మేకర్స్ ఇప్పుడు రివీల్ చేసేసారు. మరి సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పవన్ ఫ్యాన్స్ కి కావాల్సిన స్టైలిష్ అండ్ ఎనర్జిటిక్ ఛేంజెస్ అయితే చేసినట్టుగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అర్ధం అవుతుంది. వింటేజ్ పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ తో అయితే ఈ పోస్టర్ కనిపిస్తుండగా గత కొన్ని రోజులు నుంచి వైరల్ గా ఉన్న “బ్రో” టైటిల్ నే మేకర్స్ ఫిక్స్ చేశారు.

ఇక ఈ మోషన్ పోస్టర్ టీజర్ లో మరో బిగ్గెస్ట్ హైలైట్ థమన్ ఇచ్చిన స్టన్నింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. పవన్ తో సినిమాల విషయంలో థమన్ మరోసారి ది బెస్ట్ ఇస్తాడని ఈ బ్రో తో కూడా ప్రూవ్ అయ్యిందని చెప్పొచ్చు. మొత్తానికి సాలిడ్ హైప్ ఈ సినిమాపై ఇప్పుడు నెలకొంది. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ జూలై లో చిత్రం రిలీజ్ కాబోతుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :