‘చలోరే చలోరే చల్’ టూర్ ను ప్రారంభించిన పవన్ కళ్యాణ్ !
Published on Dec 6, 2017 12:00 pm IST

ప్రజా సమస్యల పరిష్కారానికి స్టార్ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన ‘చలోరే చలోరే చల్’ పర్యటనకు భారీ స్పందన లభించింది. పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం విజయనగరంలో పర్యటించి, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణ సమస్యపై పోరాడుతున్న ఉద్యోగులకు మద్దతు తెలిపేందుకు వైజాగ్ వెళ్లారు.

పవన్ వైజాగ్ విమానాశ్రయానికి చేరుకోగానే వేల సంఖ్యలో అభిమానులు అక్కడకు చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలికారు. డిసిఐ ఉద్యోగులతో భేటీ అనంతరం పవన్ ఈ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆత్మార్పణ చేసుకున్న వెంకటేష్, మురళీల కుటుంబ సభ్యులను పరామర్శించి అనంతరం 2 గంటలకు పార్టీ క్యాడర్ తో ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చలు జరపనున్నారు. పవన్ ప్లాన్ చేసిన ఈ పర్యటన ఉత్తరాంధ్రలో 4 రోజులపాటు జరగనుంది.

 
Like us on Facebook