‘వీరమల్లు’ కొత్త షెడ్యూల్ అప్పుడేనా ?

‘వీరమల్లు’ కొత్త షెడ్యూల్ అప్పుడేనా ?

Published on Feb 28, 2023 6:03 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘హరిహర వీరమల్లు’. అయితే, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఐతే, క్రిష్ టీమ్ నుంచి తాజాగా అందుతున్న అప్ డేట్ ప్రకారం.. ఈ సినిమా తర్వాత షెడ్యూల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఉగాది తర్వాత.. అనగా ఈ నెల 24 నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుందట. కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురానున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరీ ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు