యూఎస్‌లో ‘పెళ్ళిచూపులు’ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందీ?
Published on Aug 2, 2016 9:06 pm IST

Pellichoopulu
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ‘పెళ్ళిచూపులు’ అనే చిన్న సినిమా రోజూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. సుమారు కోటిన్నర బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమా మొదటివారాంతమే బ్రేక్ ఈవెన్ సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ అయిన ఏ సెంటర్స్, యూఎస్‌లో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. యూఎస్‌లో వీకెండ్‌కి 300 కే డాలర్ల వరకూ వసూలు చేసిన ఈ సినిమా, సోమవారం కూడా అదే జోరును కొనసాగిస్తూ 37,012 డాలర్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా యూఎస్‌లో ఇప్పటివరకూ 330 కే డాలర్లు (సుమారు 2.20 కోట్ల రూపాయలు) వసూలు చేసినట్లైంది.

ఇక వచ్చే వీకెండ్ కూడా కలెక్షన్స్ ఇలాగే కొనసాగితే 1 మిలియన్ డాలర్లు వసూలైనా ఆశ్చర్యపడక్కర్లేదని ట్రేడ్ భావిస్తోంది. కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికి 2 కోట్ల వరకూ షేర్ వసూలు చేసింది. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీగా ప్రేక్షకుల నుంచి కితాబులందుకుంటోంది. రాజ్ కందుకూరి యష్ రాగినేని నిర్మించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబు విడుదల చేశారు.

 
Like us on Facebook