‘పేట, విశ్వాసం’ చెన్నై కలెక్షన్స్ !

Published on Jan 11, 2019 10:30 am IST

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘పేట’ అలాగే తల అజిత్ నటించిన ‘విశ్వాసం’ భారీ అంచనాల మధ్య విడుదలై తమిళ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుట్టున్నాయి. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన పేట లో రజినీ స్టైలిష్ ప్రెజెన్స్ సినిమాకుహైలైట్ కాగా సెకండ్ హాఫ్ మైనస్ అయ్యింది. రజినీ అభిమానులను దృష్టిలో పెట్టుకొని కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి రోజు చెన్నై సిటీ లో 1.12 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇక ఫ్యామిలీ ఎంటర్టైనేర్ గా తెరకెక్కిన విశ్వాసం లో అజిత్ నటన ఫస్ట్ హాఫ్ సినిమాకు హైలైట్ కాగా క్లైమాక్స్ , జగపతి బాబు విలన్ రోల్ సినిమాలో మైనస్ అయ్యాయి. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు చెన్నై లో 88లక్షల గ్రాస్ ను వసూళ్లు రాబట్టిందని సమాచారం.

అలాగే పొంగల్ సీజన్ కావడం ఈ రెండు చిత్రాలకు బాగా కలిసిరానుంది. కాగా పేట తెలుగులో విడుదలై మిక్సడ్ రివ్యూస్ ను తెచ్చుకోగా విశ్వాసం విడుదలకావాల్సి వుంది.

సంబంధిత సమాచారం :

More