ఫోటో మూమెంట్ : కొత్తజంట తో మెగా మొనగాళ్లు..స్పెషల్ గా పవన్

ఫోటో మూమెంట్ : కొత్తజంట తో మెగా మొనగాళ్లు..స్పెషల్ గా పవన్

Published on Nov 2, 2023 8:55 AM IST

ఇప్పుడు మెగా కుటుంబం ఇంట సంతోష వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు నటి లావణ్య త్రిపాఠిల ప్రేమ వివాహం ఇటలీలో కుటుంబ సభ్యుల సమక్షంలో అయితే అంగ రంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. మరి ఈ కార్యక్రమంలో ఓ మెగా ఫ్రేమ్ కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఓ వెరీ స్పెషల్ పిక్ ఇప్పుడు బయటకి వచ్చి పిక్ ఆఫ్ ది డే గా నిలిచింది. మరి ఈ పిక్ లో అయితే మొత్తం మెగా హీరోస్ అంతా కనిపించారు.

మరి ఈ కొత్త జంటతో అయితే టోటల్ మెగా మొనగాళ్లు మెగాస్టార్ చిరంజీవి నాగబాబు, రామ్ చరణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అల్లు శిరీష్ మెగా మేనల్లుళ్లు సాయి ధరమ్ తేజ్ సహా వైష్ణవ్ తేజ్ లు కనిపించారు. అయితే వీరితో పాటుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కనిపించడంతో ఒక నిండుతనం వచ్చింది. మరి ఈ అందరిలో కూడా ఒక్క పవన్ మినహా మిగతా హీరోస్ అంతా మంచి క్లాస్ డ్రెస్సింగ్ లో కనిపిస్తే ఒక్క పవన్ మాత్రం సింపుల్ అండ్ స్టైలింగ్ లో డిఫరెంట్ కలర్ తో కనిపించాడు. దీనితో పవన్ సెపరేట్ హైలైట్ గా నిలవగా ఈ క్రేజీగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు