ఆదితో కలిసిపనిచేయనున్న వీరభద్రమ్

ఆదితో కలిసిపనిచేయనున్న వీరభద్రమ్

Published on Apr 2, 2015 10:09 PM IST

aadi-Veerabhdram-Chowdary

ఎన్నో సినిమాలకు అసిస్టంట్ డైరెక్టర్ గా పనిచేసిన వీరభద్రం ఎట్టకేలకు 2011లో అల్లరినరేష్ ని హీరోగా పెట్టి ‘అహనా పెళ్ళంట’ సినిమాను తెరకెక్కించాడు. ఆ చిత్రం విజయం సాధించడంతో ఉత్సాహంగా సునీల్ తో పూలరంగడు తీసి మరో హిట్ కొట్టాడు. అయితే బిగ్గెస్ట్ మూవీగా చేతికొచ్చిన నాగార్జున ‘భాయ్’ లో చిత్రీకరణ లోపాల కారణంగాపాడుచేసుకున్నాడు.

తాజా సమాచారం ప్రకారం ఈ దర్శకుడు త్వరలో యువ హీరో ఆదితో ఒక సినిమా చేయనున్నాడు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు. ప్రస్తుతం ఆది చేతిలో వున్నా సినిమా పూర్తికాగానే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఆది మదన్ దర్శకత్వంలో ‘గరమ్’ షూటింగ్ లో బిజీగా వున్నాడు. ఈ సినిమాలో అదా శర్మ హీరోయిన్.

తాజా వార్తలు