నాని సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ !
Published on Dec 7, 2017 4:00 pm IST

వరుస హిట్లతో మంచి జోరు మీదున్న నాని ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో ఎంసీఏ చిత్రంలో నటించాడు. డిసెంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ భూమిక ఒక కీలక పాత్రలో కనిపించనుందని నిర్మాత దిల్ రాజు తెలియజేసాడు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో రెండు పాటలు ఇది వరకే విడుదలయ్యాయి. త్వరలో మిగతా పాటలను విడుదలచెయ్యనున్నారు చిత్ర యూనిట్. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. తాజాగా విడుదల చేసిన ఈ టీజర్ కు సైతం మంచి ఆదరణ దక్కింది.

 
Like us on Facebook