ప్రభాస్ సినిమా టైటిల్ ‘జాన్‌’ ?

Published on Oct 13, 2018 11:02 am IST

గోపీచంద్ తో `జిల్` చిత్రాన్ని తెరకెక్కించిన ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌ తెరకెక్కిస్తోన్న పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతుంది. ప్రభాస్‌ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా ఈ సినిమాకు ‘అమూర్‌’ అనే ఫ్రెంచ్‌ టైటిల్‌ ను పెట్టబోతున్నారని.. ‘అమూర్‌’ పదానికి ఫ్రెంచ్‌ లో ప్రేమ అని మీనింగ్ వస్తోందని.. ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఆసక్తికరంగా ‘జాన్‌’ అనే టైటిల్‌ ను పెట్టబోతున్నారని తెలుస్తోంది. మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2019 చివ‌ర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం ఇప్పటి నుండే సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :