ప్రభాస్ బర్త్ డే మంత్ షురూ..ఊరిస్తున్న అప్డేట్స్ ఇవే!

Published on Oct 1, 2021 8:49 pm IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా వాటితో పాటుగా మరిన్ని సాలిడ్ ప్రాజెక్ట్ లును కూడా డార్లింగ్ సెట్ చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే మన స్టార్ హీరోల పుట్టినరోజు వచ్చింది అంటే ఇక అభిమానులకి పండగే వేరు. అలానే ఇప్పుడు ఈరోజు అక్టోబర్ 1తో ఎంటర్ కావడంతో ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో హంగామా మొదలు పెట్టారు. నిజానికి ఈ నెల కోసం వారు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఈ నెలలో తన సినిమాలపై ఆసక్తికర అప్డేట్స్ ఊరిస్తున్నాయి. మొదటగా రాధే శ్యామ్ నుంచి అయితే ఫస్ట్ సింగిల్ కానీ టీజర్ కానీ వస్తుందని అంతా ఆశిస్తుండగా. ఆదిపురుష్ నుంచి రామునిగా ప్రభాస్ ది సాలిడ్ పోస్టర్ అలాగే సలార్ మరియు తన పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కే నుంచి కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రానున్నాయి. మొత్తానికి మాత్రం ప్రభాస్ బర్త్ డే రోజు అక్టోబర్ 23న పెద్ద ఎత్తున ట్రీట్ లే ఉన్నాయని చెప్పాలి. మరి అప్పుడికి మేకర్స్ ఎలాంటి ప్లాన్స్ వేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :