పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఎంతటి మోస్ట్ వాంటెడ్ హీరో అనేది అందరికీ తెలిసిందే. అంత పెద్ద స్టేచర్ పెట్టుకొని రెబల్ స్టార్ బాహుబలి తర్వాత నుంచి ప్రయోగాలు మీద ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు వరకు తన నుంచి కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఇప్పుడు వచ్చిన రాజా సాబ్ అనే చెప్పాలి.
పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా, తన సినిమాల ఎంపిక పరంగా చూసుకున్నా రాజా సాబ్ ఎంపిక ఒకింత రిస్క్ అనే చెప్పుకోవచ్చు. ఇలా దీనికి పార్ట్ 2 గా ది రాజా సాబ్ సర్కస్ 1935 (The Raja Saab Circus 1935) అంటూ క్లైమాక్స్ లో అనౌన్స్ చేశారు. ఇక్కడే ప్రభాస్ జోకర్ లుక్ లో కనిపించడం జరిగింది. అయితే ఇది మరింత డేరింగ్ స్టెప్ అని చెప్పాల్సిందే.
ఈ లీడ్ లో జోకర్ లుక్ అనేది కేవలం ఏదో చూపించాలి కాబట్టి చూపిస్తారు అని కాకుండా మరింత ఇంపార్టెన్స్ దానికి ఉండేలా చూపిస్తారు అనిపిస్తుంది. దీనితో ప్రభాస్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి ఏదో కొత్తగా ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి. మరి దీనిని కరెక్ట్ గా ప్రెజెంట్ చేస్తే బాగుంటుంది. సో దర్శకుడు పార్ట్ 2 నుంచి మాత్రం మరింత జాగ్రత్తగా తెరకెక్కించాల్సి ఉంటుంది. ఇలా ప్రభాస్ ఎంపిక పార్ట్ 2 కూడా ఒకింత డేరింగ్ స్టెప్పే అని చెప్పి తీరాలి.


