స్ట్రాంగ్ బజ్..ప్రభాస్ రామవతారం లుక్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్?

Published on Sep 19, 2021 8:35 am IST

ఇప్పుడు మన ఇండియన్ సినిమా దగ్గర అసలు ఎలాంటి సాలిడ్ రోల్ కి అయినా కూడా సెట్టయ్యే అతి తక్కువ మంది పర్సనాలిటీ లలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకరని చెప్పి తీరాలి. ఓ మహా యోధుడు పాత్ర నుంచి అలరించే ప్రేమికుడు వరకు.. స్టన్నింగ్ యాక్షన్ చేసే మాస్ కటౌట్ నుంచి ఆరాధించే రాముని పాత్ర వరకు ప్రభాస్ ఇప్పుడు అలా సెట్టయ్యాడు..

మరి ఇప్పుడు తాను చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో దర్శకుడు ఓంరౌత్ తో చేస్తున్న భారీ మిథలజికల్ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంలో ప్రభాస్ రామునిగా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా ఇప్పుడు ఫైనల్ షెడ్యూల్ లోకి అడుగు పెట్టగా మరో స్ట్రాంగ్ బజ్ ఈ సినిమాపై వినిపిస్తోంది. అసలు ఈ ప్రాజెక్ట్ మొదలైన నాటి నుంచి కూడా ప్రభాస్ అభిమానులు రాముడు గా ప్రభాస్ ఎలా ఉంటాడా ఓంరౌత్ ఏ విజువల్ లో చూపిస్తాడా అని అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి దానికి తెరపడే రోజు దగ్గరలోనే ఉందని బజ్ వినిపిస్తోంది. మరి దాని ప్రకారం ఈ సినిమా నుంచి ప్రభాస్ స్టన్నింగ్ లుక్ ని రానున్న అక్టోబర్ నెలలో తన బర్త్ డే కానుకగా రిలీస్ చెయ్యాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఆల్ మోస్ట్ ఇది కన్ఫర్మ్ అనే తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది ఇంకొన్ని రోజులు ఆగితే కన్ఫర్మ్ అయ్యిపోతుంది. సో అప్పుడు వరకు ఎదురు చూడక తప్పదు.

సంబంధిత సమాచారం :