ప్రభాస్ “సలార్” మరింత ఆలస్యంగా రానుందా..?

Published on Mar 18, 2022 8:00 pm IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “రాధే శ్యామ్” తో మళ్ళీ పాన్ ఇండియా ఆడియెన్స్ ని పలకరించాడు. మరి ఈ సినిమా తర్వాత భారీ సినిమాలు మరికొన్ని తన లైన్ లో ఉన్నాయి. అయితే ఇవి మాత్రం వేరే లెవెల్ అంచనాలు ఉన్న సినిమాలని చెప్పాలి. క్లాస్ షేడ్ లో కాకుండా మరింత గ్రాండ్ గా మాసివ్ ఎలిమెంట్స్ తో అదిరే లైనప్ ని ప్రభాస్ సిద్ధం చేసాడు.

అయితే ఏడాదికి ప్రభాస్ రెండు సినిమాలని రిలీజ్ చేస్తానన్న మాటలో ఈ ఏడాది రెండు కాదు మూడు సినిమాలు రిలీజ్ అవుతాయని అంతా ఆశించగా చివరికి ఒక సినిమానే వచ్చింది. అలాగే “ఆదిపురుష్” చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి పోస్ట్ పోన్ చేసినట్టు కూడా అనౌన్స్ చేశారు. అయితే మధ్యలో “సలార్” దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేసిన భారీ యాక్షన్ థ్రిల్లర్ కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కావాల్సి ఉంది.

కానీ ఈ సినిమా మాత్రం మరింత ఆలస్యం అవ్వనున్నట్టు తెలుస్తుంది. ఈ ఏడాదిలో కనీసం దసరా లేదా ఆ తర్వాత రిలీజ్ అవుతుందేమో అని టాక్ ఉండగా ప్రస్తుతం అయితే ఇక ప్రభాస్ నుంచి రిలీజ్ అయ్యే సినిమా “ఆదిపురుష్” నే అని దీని తర్వాత సలార్ రిలీజ్ అవుతుంది అని తెలుస్తుంది. మరి మళ్ళీ వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం :