భారీ ధరకి ప్రభాస్ “కల్కి 2898AD” డిజిటల్ రైట్స్?

భారీ ధరకి ప్రభాస్ “కల్కి 2898AD” డిజిటల్ రైట్స్?

Published on Mar 25, 2024 7:31 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898AD (kalki 2898AD). ఈ చిత్రం ను మే 9, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరొక ఈ సినిమా కి సంబందించిన డిజిటల్ రైట్స్ అంశం హాట్ టాపిక్ గా మారుతోంది.

ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన అమేజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు సమాచారం. సౌత్ ఇండియా భాషలకి గానూ, 150 కోట్ల రూపాయలకి పైగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్ కి సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. దీపికా పదుకునే, దిశా పటాని లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు