రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘కణం’ ట్రైలర్ !
Published on Nov 16, 2017 10:20 am IST

నాగశౌర్య, ‘ఫిదా’ ఫేమ్ సాయి పల్లవిలు జంటగా నటించిన ‘కణం’ చిత్రం ట్రైలర్ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 18న సాయంత్రం 5 గంటలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. ప్రముఖ నటుడు, డాన్సర్ ప్రభుదేవా ఈ ట్రైలర్ ను స్వయంగా విడుదలచేయనున్నారు. హర్రర్ జానర్లో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ తెరకెక్కిస్తున్నారు.

హర్రర్ జానర్లో రూపొందిన ఈ చిత్రాన్ని ‘2.0’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండటం విశేషం. అంతేగాక ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ నిర్వాణ సాహ పనిచేస్తున్నారు. ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్ర్రానికి తమిళంలో ‘కారు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

 
Like us on Facebook