బుచ్చిబాబు సానా చేతుల మీదుగా ‘పురుష:’ టీజర్ విడుదల

బుచ్చిబాబు సానా చేతుల మీదుగా ‘పురుష:’ టీజర్ విడుదల

Published on Jan 9, 2026 8:00 AM IST

purusha 1

నేటి తరం భార్యాభర్తల బంధాన్ని, పెళ్లి తర్వాత పురుషులు ఎదుర్కొనే సరదా ఇబ్బందులను ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కిన చిత్రం ‘పురుష:’. పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా తాజాగా విడుదల చేశారు. టీజర్ ఆద్యంతం వినోదభరితంగా సాగుతూ సినిమాపై అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా సప్తగిరి చెప్పిన “షాపింగ్” డైలాగ్ ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది.

​కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. భార్య ప్రాముఖ్యతను గుర్తుచేస్తూనే, అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా దీనిని రూపొందించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ కాగా, తాజాగా వచ్చిన టీజర్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచింది.

​ఈ చిత్రంలో సప్తగిరి, వెన్నెల కిషోర్, కాసిరెడ్డి రాజకుమార్, వి.టి.వి. గణేష్ వంటి భారీ తారాగణం నవ్వులు పూయించనుంది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు