“పుష్ప 2 ది రూల్” టీవీ పార్ట్ నర్ పై క్లారిటీ!

“పుష్ప 2 ది రూల్” టీవీ పార్ట్ నర్ పై క్లారిటీ!

Published on Feb 1, 2024 7:08 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప 2 ది రూల్. ఈ చిత్రం కోసం ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకీ సంబందించిన ఫస్ట్ పార్ట్ థియేటర్ల లో రిలీజ్ అయ్యి దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో ఫాహద్ ఫజిల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా ఛానెల్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు