ఈసారి దద్దరిల్లనున్న “పుష్ప” రాజ్ రాక.!

ఈసారి దద్దరిల్లనున్న “పుష్ప” రాజ్ రాక.!

Published on Nov 13, 2022 1:05 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా చిత్రం పుష్ప కోసం అందరికీ తెలిసిందే. మరి క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంకి అయితే ఇప్పుడు మేకర్స్ డబుల్ ట్రీట్ ని భారీ బడ్జెట్ తో అత్యంత గ్రాండ్ గా ప్లాన్ చెయ్యగా ఇప్పుడు పుష్ప 2 బ్లాస్ట్ పై గత కొన్ని రోజులు నుంచి క్రేజీ వార్తలే బయటకి వచ్చాయి.

మరి పుష్ప 2 టీజర్ ని అయితే వరల్డ్ అవైటెడ్ చిత్రం “అవతార్ 2” సినిమా థియేట్రికల్ రిలీజ్ కి అటాచ్ చేసి నేరుగా థియేటర్స్ లో ప్లే చెయ్యనున్నట్టుగా సమాచారం రాగా ఇప్పుడు ఇది నిజమే అని తెలుస్తుంది. ఈ డిసెంబర్ 16న థియేటర్స్ లో అయితే పుష్ప ఇండియా వరకు వీలైనన్ని అనేక భాషల్లో వెర్షన్స్ తో పుష్ప ది రూల్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేయనున్నారట. దీనితో మాత్రం పుష్ప పై నెక్స్ట్ లెవెల్ హైప్ స్టార్ట్ కాగా ఒక్కసారి వచ్చాక అయితే పాన్ ఇండియా వైడ్ పుష్ప రాజ్ మ్యానియా మరో లెవెల్ లో రచ్చ చేయడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు