అక్కడ “పుష్ప” అంటే ఫైర్..అని ప్రూవ్ చేస్తున్న ఐకాన్ స్టార్.!

Published on Dec 26, 2021 3:30 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ బాక్సాఫీస్ మాన్స్టర్ చిత్రం “పుష్ప ది రైజ్”. భారీ అంచనాలు నడుమ పాన్ ఇండియన్ వైడ్ రిలీజ్ అయ్యి భారీ వసూళ్ళని ఈ చిత్రం అందుకుంది. ముఖ్యంగా సౌత్ ఇండియన్ అన్ని భాషల్లోనే కాకుండా హిందీలో అయితే పుష్ప రాజ్ నిజంగా ఆశ్చర్యపరిచాడు అని చెప్పాలి.

మొదటి రోజు నుంచే ఊహించని వసూళ్లతో వీక్ డేస్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ కనబరుస్తూ అదరగొట్టాడు. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఈ సినిమా డెఫినెట్ గా అనుకున్న మార్క్ కి మించే భారీ వసూళ్ళని అందుకుంటుంది అని తెలుస్తుంది. మొదటి వారనికి గాను ఆల్రెడీ 30 కోట్లకుపై వసూళ్ళని అందుకొని ఈ వారాంతానికి కూడా అదే గట్టి వసూళ్లు రాబడుతూ కొనసాగుతుంది.

ఈ శనివారం కూడా పుష్ప మంచి ఫిగర్ అందుకుందట ఇక ఆదివారం కూడా పలు సినిమాలకి మించే ఇదే కొనసాగుతుందట. మరి ఓవరాల్ గా అయితే పుష్ప పుష్ప హిందీలో 50 కోట్ల మార్క్ ని అందుకున్నా ఆశ్చర్యం లేదని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సరైన ప్రమోషన్స్ లేకుండా ఇదే సాధ్యం అయితే పుష్ప అంటే ఫైర్ అని ఐకాన్ స్టార్ ప్రూవ్ చేసినట్టే అని చెప్పాలి. ఇక రెండో పార్ట్ కి గాని సరైన ప్రమోషన్స్ చేస్తే దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పడంలో సందేహమే లే..

సంబంధిత సమాచారం :