“రాధే శ్యామ్” దెబ్బకి క్రాష్ అయ్యిపోయిన సైట్.!

Published on Mar 5, 2022 9:00 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ కుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో అనేక అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని మేకర్స్ రిలీజ్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ గ్యాప్ లో సరైన సరికొత్త ప్రమోషన్స్ తోనే రంగం సిద్ధం చేశారు.

అందులో భాగంగానే రాధే శ్యామ్ మెటా వెర్స్ అంటూ ఒక సరికొత్త టెక్నాలజీ ని పరిచయం చేసి అందులో సినిమా ట్రైలర్ ని స్క్రీనింగ్ చేశారు. అయితే దీనికి గాను రాధే శ్యామ్ డాట్ కామ్ అనే కొత్త వెబ్ సైట్ ని కూడా ఫిక్స్ చెయ్యగా అది రిలీజ్ చెయ్యగానే ఒక్కసారిగా దానిపై 3 లక్షల మందికి పైగా వచ్చి పడ్డారట దీనితో దెబ్బకి సైట్ క్రాష్ అయ్యిపోయింది సినీ వర్గాల్లో టాక్ ఇప్పుడు బయటకి వచ్చింది. మరి దీనితో రాధే శ్యామ్ పట్ల అభిమానులు మరియు ఆడియెన్స్ ఎంత క్రేజీ గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :