“రాధే శ్యామ్” బాక్సాఫీస్ ర్యాంపేజ్..రెండు రోజుల్లో భారీ వసూళ్లు.!

Published on Mar 13, 2022 1:00 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “రాధే శ్యామ్” ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి టాక్ తో సంబంధం లేకుండా అదిరే వసూళ్ళని అందుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమా మొదటి రోజే ఏకంగా 79 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టి ఈ ప్యాండమిక్ తర్వాత రికార్డు ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా రికార్డు సెట్ చెయ్యగా ఇప్పుడు మేకర్స్ రెండు రోజుల అధికారిక గ్రాస్ ని అనౌన్స్ చేశారు.

అయితే ఈ రెండు రోజులకి గాను రాధే శ్యామ్ బాక్సాఫీస్ ర్యాంపేజ్ చూపించిందని చెప్పాలి. ఈ రెండు రోజులకి పి ఆర్ నంబర్స్ ప్రకారం ఏకంగా 119 కోట్ల గ్రాస్ ని అందుకొని సాలిడ్ నంబర్స్ ని నమోదు చేసినట్టుగా సినిమా మేకర్స్ యూవీ క్రియేషన్స్ వారు అనౌన్స్ చేశారు. మొత్తానికి అయితే డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ దగ్గర మళ్ళీ తన బాక్సాఫీస్ స్టామినా చూపిస్తున్నాడని చెప్పాలి. మరి ఫైనల్ రన్ లో రాధే శ్యామ్ ఎక్కడ ఆగుతుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :