తొలి ప్రయత్నంలోనే గ్రాండ్ సక్సెస్ అందుకున్న రష్మిక !

గత వారం విడుదలైన సినిమాల్లో నాగ శౌర్య నటించిన ‘ఛలో’ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుని హిట్ దిశగా పరుగులు తీస్తోంది. మంచి కామెడీ కంటెంట్ తో తెరకెక్కిన ఈ లవ్ స్టోరీతో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. చిత్రంలో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కు, పెర్ఫార్మెన్స్ కు మంచి మార్కులే వేశారు ప్రేక్షకులు. ఈ విజయంతో ఆమెకు బోలెడంత క్రేజ్ దక్కింది. దీంతో చాలా మంది దర్శకులు తన సినిమాల్లో యంగ్ హీరోలకు జోడీగా ఆమెనే పరిశీలిస్తున్నారు.

ఇలా తొలి సినిమాతోనే స్టార్ స్టేటస్ దక్కిచుకోవడం విశేషమనే చెప్పాలి. కన్నడలో కూడా ఆమె చేసిన మొదటి చిత్రం ‘కిరిక్ పార్టీ’ ఘన విజయాన్ని అందుకుని ఆమెను ఓవర్ నైట్ స్టార్ ను చేసేసింది. ప్రస్తుతం ఈమె పరశురామ్ దర్వకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంటే యంగ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో రష్మిక పేరు చేరిపోవడం ఖాయం.