థియేటర్ల లోకి నవంబర్ లో వస్తున్న “రాజా విక్రమార్క”

Published on Oct 20, 2021 12:35 pm IST

గుమ్మకొండ కార్తికేయ హీరోగా శ్రీ సారిపల్లి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రాజా విక్రమార్క. ఈ చిత్రం లో కార్తికేయ సరికొత్త రూపం లో కనిపిస్తున్నారు. ఆది రెడ్డి టి సమర్పణ లో శ్రీ చైత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని 88 రమా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించడం జరిగింది. ఈ చిత్రాన్ని నవంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ చిత్రాన్ని నవంబర్ 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను సైతం చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. ఈ చిత్రం లో తాన్య రవి చంద్రన్ కార్తికేయ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

More