నాని సినిమాకి బిగ్ బూస్ట్ ఇచ్చిన రాజమౌళి !
Published on Jun 18, 2017 12:09 pm IST


యంగ్ హీరో నాని చేస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘నిన్ను కోరి’. ప్రతి సినిమాలో అద్భుతమైన నటనతో పాటు కథలో వైవిధ్యం కూడా కనబర్చే నాని ఈ సినిమాలో ఎలాంటి కొత్తదనం చూపిస్తాడో చూడాలని అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో నిన్న విడుదలైన ట్రైలర్ బ్రహ్మాండమైన స్పందన దక్కించుకుంది. విడుదలైన 24 గంటల్లోనే వివిధ మాధ్యమాల్లో కలిపి ఈ ట్రైలర్ కు 5 మిలియన్ల వ్యూస్ దక్కాయి. ట్రైలర్ చూసిన చాలా మంది ఇదేదో డిఫరెంట్ లవ్ స్టోరీలా ఉందే అంటున్నారు.

అంతేగాక ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సైతం ట్రైలర్ చాలా బాగుంది. ‘చూస్తున్నంతసేపు మొదటి రోజు మొదటి షో చూడాలనే ఉద్దేశ్యం కనిపిస్తోంది’ అంటూ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేసి సినిమాకు, చిత్ర యూనిట్ కు బిగ్ బూస్ట్ అందించారు. ఇకపోతే నూతన దర్శకుడు శివ నిర్వాణ డైరెక్టక్ చేసిన ఈ చిత్రాన్ని జూలై నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ట్రైలర్ కొరకు క్లిక్ చేయండి :

 
Like us on Facebook