లేటెస్ట్ : తన డ్రీమ్ ప్రాజక్ట్ పై రాజమౌళి క్లారిటీ …. !!

Published on Jul 5, 2022 2:30 am IST

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో లేటెస్ట్ గా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ ఎంత పెద్ద సక్సెస్ కొట్టిందో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ ప్రతిష్టాత్మక మూవీ పాన్ ఇండియాని మించి పాన్ వరల్డ్ స్థాయిలో భారీ గుర్తింపుని సంపాదించింది. ఇక త్వరలో సూపర్ స్టార్ మహేష్ తో తన నెక్స్ట్ మూవీ చేయనున్నారు రాజమౌళి. దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఈ మూవీని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి స్టోరీ డిస్కషన్స్ లో పాల్గొంటున్నారు రాజమౌళి.

అయితే లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూ లో భాగంగా ఆయన మాట్లాడుతూ తన కెరీర్ లో డ్రీమ్ ప్రాజక్ట్ అయిన మహాభారతం గురించి చెప్పుకొచ్చారు రాజమౌళి. నిజానికి మహాభారతం అనేది ఒక మహాసముద్రం వంటిదని, అందులోకి అడుగుపెట్టేందుకు మరికొంత సమయం పడుతుందని వెల్లడించిన రాజమౌళి, తనకి పురాణాలు, ఇతిహాసాలపై ఎంతో అపార గౌరవం ఉందన్నారు. అయితే మహాభారతాన్ని తీయడానికి తన తదుపరి మూడు, నాలుగు సినిమాల అనంతరమే సాధ్యం అవుతుందని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. దీనిని బట్టి మొత్తంగా రాజమౌళి తన డ్రీమ్ ప్రాజక్ట్ తీయడానికి దాదాపుగా పదేళ్లు పెట్టె అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :