“RRR 2” పై హింట్ మీద హింట్ ఇస్తున్న జక్కన్న.!

“RRR 2” పై హింట్ మీద హింట్ ఇస్తున్న జక్కన్న.!

Published on Nov 13, 2022 8:07 PM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ భారీ బ్లాక బస్టర్ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇప్పటికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా స్పెషల్ స్క్రీనింగ్స్ లో ఎక్కడా ఆదరణ తగ్గడం లేదు.

దీనితో ఈ క్రేజీ ప్రాజెక్ట్ మరింత సెన్సేషన్ గా మారగా ఎప్పుడు నుంచో ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందా అనే అంశం మరింత ఆసక్తిగా మారింది. అయితే అప్పుడు నుంచే ఆ ఆలోచన అయితే ఉందని రాజమౌళి కూడా కన్ఫర్మ్ చేసాడు. ఇక లేటెస్ట్ గా అయితే రెండు సార్లు జక్కన్న ఒకవేళ సీక్వెల్ ఉంటే ఆ లైన్ ఎలా ఉంటుంది అనేది కూడా రివీల్ చేసినట్టు పలు రూమర్స్ రాగా..

ఇప్పుడు మరోసారి దీనిపై హింట్ వచ్చింది. తాను లేటెస్ట్ గా మాట్లాడుతూ ప్రస్తుతం పార్ట్ 2 కోసం చర్చలు సాగుతున్నాయని ఇంకా ఏది ఫైనల్ కాలేదని చెప్పుకొచ్చారు కానీ సీక్వెల్ పనులు అయితే ఆన్ లోనే ఉన్నాయని చెప్పడం మంచి ఆసక్తిగా మారింది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు