దర్బార్ మూవీ సెట్స్ పై ఉండగానే రజిని మరో క్రేజీ మూవీ ప్రకటించేశారు. మాస్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థలో ఓ మూవీ తెరకెక్కనున్నట్లు ప్రకటించేశారు. నేడు కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించిన చిన్న అనౌన్స్మెంట్ వీడియో సోషల్ మాధ్యమాలలో విడుదల చేశారు. గత కొన్నిరోజులుగా వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ రానున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో నేటితో దీనిపై స్పష్టత వచ్చింది.
తల అజిత్, డైరెక్టర్ శివ లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరు వరుసగా, వీరం, వేదాళం, వివేకం,విశ్వాసం వంటి హిట్ మూవీస్ చేయడం జరిగింది. దీనితో మొదటిసారి రజిని తో ఈ డైరెక్టర్ చేయనున్న మూవీపై కూడా భారీ అంచనాలున్నాయి. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకెళ్లున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదలయ్యే అవకాశం కలదు. ఇక మురుగదాస్ దర్శకత్వంలో రజిని చేస్తున్న దర్బార్ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
After the blockbuster hits Enthiran and Petta, the mega hit combo of Superstar @rajinikanth and @sunpictures come together for the third time for Thalaivar 168, Superstar’s next movie, directed by @directorsiva#Thalaivar168BySunPictures pic.twitter.com/AL5Z6ryjbG
— Sun Pictures (@sunpictures) October 11, 2019


