రాజకీయాల్లోకి రావడనికి తొందరేం లేదన్న రజనీకాంత్ !
Published on Nov 23, 2017 11:13 am IST

దక్షిణాదిన వాడీ వేడిగా నడుస్తున్న అంశాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం కూడా ఒకటి. ఇప్పటికే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు సూచనప్రాయంగా తెలిపిన రజనీ పలుసార్లు అభిమానులతో పలుసార్లు ముఖాముఖి సమావేశాలు కూడా జరిపి త్వరలోనే రాజకీయాల్లోకి దిగుతున్నట్టు తెలిపారు. దీంతో తమిళ రాజకీయ వర్గాల్లో అలజడి మొదలవగా ఆయన అభిమానులు మాత్రం పుట్టినరోజున రజనీ పార్టీని ప్రకటిస్తారని తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో రజనీ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఇటీవలే మంత్రాలయంను సందర్శించుకున్న ఆయన రాజకీయాల్లోకి రావడానికి తనకేం తొందరలేదని, డిసెంబర్ 12 తన పుట్టినరోజు తర్వాత అభిమానుల్ని కలుస్తానని చెప్పారాయన. దీంతో రజనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలని అందరిలోను ఉత్కంఠ రేగుతోంది.

 
Like us on Facebook