రామ్ చరణ్ లైనప్ మామూలుగా లేదుగా…ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా మూవీ!

Published on Oct 15, 2021 10:00 pm IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో రౌద్రం రణం రుధిరం చిత్రం లో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ మరొక హీరో. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అంతేకాక ఈ చిత్రం తో పాటుగా మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ రెండు చిత్రాలు కూడా భారీ విడుదల కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

అయితే రామ్ చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ తో మరొక చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కనుంది. శంకర్ తో పాటుగా మరొక డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో తన 16 వ చిత్రాన్ని చేస్తున్నారు రామ్ చరణ్. తాజాగా రామ్ చరణ్ మరొక క్రేజీ కాంబినేషన్ పై హింట్ ఇచ్చారు. తన 17 వ చిత్రం ప్రశాంత్ నీల్ తో తెరకెక్కనుంది. ప్రశాంత్ నీల్ ఇప్పటికే కేజీఎఫ్ చిత్రం తో సెన్సేషన్ క్రియేట్ చేసారు. ఈ చిత్రం సీక్వెల్ విడుదల కి సిద్దం గా ఉంది. అంతేకాక ప్రభాస్ తో సలార్ అంటూ మరొక చిత్రాన్ని ప్రకటించారు. ఎన్టీఆర్ తో కూడా మరొక చిత్రం చేయనున్నారు ప్రశాంత్ నీల్. ఇది కూడా పాన్ ఇండియా మూవీ కానుంది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ తన 17 వ చిత్రం కి ప్రశాంత్ నీల్ ఫిక్స్ అవ్వడం తో ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఏదేమైనా రామ్ చరణ్ వరుస క్రేజీ కాంబినేషన్స్ ను సెట్ చేయడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :