ఇంట్రో సాంగ్ షూట్‌కు రెడీ అయిన చరణ్!
Published on Oct 30, 2016 6:12 pm IST

dhruva
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ధృవ’ ఎప్పుడెప్పుడు థియేటర్ల ముందుకు వచ్చేస్తుందా.. ఎప్పుడెప్పుడు చూసేద్దామా.. అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమాపై భారీగా ఉన్న అంచనాలను దసరా కానుకగా విడుదలైన టీజర్, ఆ తర్వాత నుంచి ఒక్కొక్కటిగా విడుదలవుతూ వస్తోన్న పోస్టర్స్ తారాస్థాయికి చేర్చాయి. ఇక ఈ రెస్పాన్స్‌తో హ్యాపీ అయిన టీమ్ రెట్టించిన ఉత్సాహంతో డిసెంబర్ 2న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు కృషి చేస్తోంది.

ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తికాగా నవంబర్ 2 నుండి మిగిలి ఉన్న ఒక్క ఇంట్రో సాంగ్‌ను కూడా పూర్తి చేయనున్నట్లు టీమ్ తెలిపింది. అదిరిపోయే బీట్‌తో సాగే ఈ ఇంట్రో సాంగ్ కోసం టీమ్ భారీగా ఖర్చు పెట్టనుందట. ఇక ఈ సాంగ్ షూట్ అయిపోగానే చరణ్ భారీ ఎత్తున ప్రమోషన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. తమిళంలో ఘన విజయం సాధించిన తని ఒరువన్‌కి రీమేక్ అయిన ఈ పోలీస్ థ్రిల్లర్‌కు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తూండగా, గీతా ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నాటితరం హీరో అరవింద్ స్వామి విలన్‍గా కనిపించనున్నారు.

 
Like us on Facebook