ఫిబ్రవరి 6నుండి కృష్ణవంశీ సినిమాలో పాల్గొనున్న రామ్ చరణ్

Published on Jan 10, 2014 9:25 pm IST

వచ్చేనెల 6వ తేదీనుండి రామ్ చరణ్ కృష్ణవంశీ సినిమాలో జతకలవనున్నాడు. బండ్లగణేష్ నిర్మాత. శ్రీకాంత్ ముఖ్యపాత్రధారి. రామ్ చరణ్ మొదటిసారిగా కృష్ణవంశీతో కలిసి నటిస్తున్నాడు. ఈ ఫ్యామిలీ డ్రామాకు ఎటువంటి కధను ఎంచుకుంటారన్నది ఆసక్తికరం

ఈ సినిమాలో కాజల్ హీరోయిన్. రామ్ చరణ్ తన ఫేస్ బుక్ పేజ్ లో అద్గిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ “కాజల్ నేను ప్రత్యేకమైన పనివాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఆన్ స్క్రీన్ మీద మేము బెస్ట్ కొ స్టార్లమ్” అని అన్నాడు. మగధీర, నాయక్ సినిమాలే కాక రామ్ చరణ్ తాజా సినిమా ఎవడులో కూడా ఒక అతిధిపాత్ర పొషించింది. థమన్ సంగీత దర్శకుడు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు

సంబంధిత సమాచారం :