పూరి, ఛార్మి.. ఇద్దరూ బంగారమండి : రామ్

Published on Jul 22, 2019 6:29 pm IST

‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం గత వారం విడుదలై దిగ్విజయంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. దీని పట్ల చిత్ర యూనిట్, అభిమానులు హ్యాపీగా ఉండగా పూరి, రామ్ మధ్య విభేదాలు ఉన్నట్టు పుకార్లు పుట్టుకొచ్చాయి. సినిమా విడుదల ఇంకొన్ని రోజులు ఉందనగా రామ్ హాలీడే ట్రిప్ కోసం విదేశాలకు వెళ్లడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి.

అవి కాస్త పెరిగి పెరిగి చివరికి నిర్మాతలు పూరి, ఛార్మి ముందుగా ఇస్తామన్న పారితోషకంలో కేవలం సంగం మాత్రమే ఇవ్వడంతో రామ్ నొచ్చుకుని ప్రచార కార్యక్రమాలకి రాలేదని, త్వరలో ఆయన ఈ విషయమై నిర్మాతల మండలికి కూడా వెళ్లనున్నారని వార్తలు పుట్టుకొచ్చాయి. దీంతో ఇక లాభం లేదనుకున్న రామ్ ట్విట్టర్ ద్వారా సాధారణంగా నేను ఇలాంటి వాటికి స్పందించను. కానీ ఇప్పుడు స్పందిస్తున్నాను. ఛార్మి, పూరి ఇద్దరూ బంగారం అంటూ కితాబిచ్చేశారు. దీంతో పుకార్లకు చెక్ పడినట్లైంది.

సంబంధిత సమాచారం :