వైజాగ్ షెడ్యూల్ ను ముగించేసిన రామ్ !
Published on May 14, 2017 4:23 pm IST


ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తునం సంగతి తెలిసిందే. ఈ చిత్రం యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొదట హైదరాబాద్ షెడ్యూల్ ను పూర్తి చేసిన టీమ్ తర్వాత కొత్త షెడ్యూల్ కోసం వైజాగ్ వెళ్లారు. ఇప్పుడు ఈ షెడ్యూల్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లోనే ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది.

ఇక తర్వాతి షెడ్యూల్ ను హైదరాబాద్లో మే 26 నుండి మొదలుపెట్టి అది పూర్తైన వెంటనే మరోసారి వైజాగ్లో షూటింగ్ చేస్తారని చిత్ర నిర్మాత స్రవంతి రవి కిశోర్ తెలిపారు. ఇకపోతే ఈ సినిమాలో రామ్ సరసన మేఘా అక్ష, అనుపమ పరమేశ్వరన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కోసం రామ్ పూర్తిగా లుక్ మార్చి కొత్తగా కనిపిస్తుండటం, రామ్ – కిశోర్ తిరుమల గత చిత్రం ‘నేను శైలజ’ మంచి హిట్ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలే ఉన్నాయి.

 
Like us on Facebook