మెగా అభిమానులకు సారీ చెప్పిన రామ్ గోపాల్ వర్మ
Published on Aug 23, 2016 8:22 am IST

Ram-Gopal-Varma
ఎవరి గురించైనా, ఏ విషయంలోనైనా నిర్మొహమాటంగా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. అందుకే నిత్యం ఆయన చుట్టూ ఏదో ఒక వివాదం తిరుగుతూనే ఉంటుంది . అలాంటి రామ్ గోపాల్ వర్మ తాజాగా మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం. 150 పైన కూడా మెగా అభిమానులు నొచ్చుకునేలా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సినిమా టైటిల్ ప్రకటించగానే ’28 ఏళ్ల క్రితం చిరు ఖైదీ నెం.786 తీశారు. కానీ ఈ ఖైదీ నెం. 150 టైటిల్ చూస్తే ఏమంత బాగోలేదు’ అంటూ ట్వీట్లు పెట్టారు. దీంతో మెగా అభిమానాలు కూడా కొంత నొచ్చుకున్నారు.

కానీ తాజాగా వర్మ నిన్న సాయంత్రం మెగా అభిమానవులందరికీ క్షమాపణలు చెప్పాడు. ఖైదీ నెం. 150 ఫస్ట్ లుక్ చూసిన తరువాత తన అభిప్రాయం మార్చుకున్నానని, సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని, ఈ లుక్ చిరంజీవి కెరీర్లోనే బెస్ట్ లుక్ అని ట్వీట్లు పెట్టారు. దీంతో మెగా అభిమానులు వర్మ ఖచ్చితత్వం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందన్న ధీమాని కూడా వ్యక్తం చేశారు.

 
Like us on Facebook