పవన్ సీఎం అవుతాడు.. లేదా సీఎంకి మొగుడవుతాడు – వర్మ

Published on Feb 25, 2019 4:20 pm IST

రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో అలాగే తన వివాదాస్పద ట్వీట్లతో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే హడావుడి చేస్తున్నాడు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుండి విడుదల చేసిన వెన్నుపోటు పాటతోనే తెలుగు తమ్ముళ్ల మనోభావాలను కెలికాడు వర్మ. ఆ తరువాత టీజర్, ట్రైలర్ లతో వివాదాలకు బాగానే పునాది తీశాడు. అంతటితో ఆగని వర్మ సోషల్ మీడియాలో కూడా తాజాగా చంద్రబాబును టార్గెట్ చేస్తున్నాడు.

వర్మ ట్వీట్ చేస్తూ.. ‘సీ.బీ.ఎన్ , పీ.కేని వాడుకుని అలవాటు ప్రకారం వెన్నుపోటు పొడిచినందుకు ప్రతీకారంగా రానున్న ఎన్నికలలో.. పవన్ కళ్యాణ్ తన నైజములో ఉన్న నిజాయితీతో చంద్రబాబుకు ముందుపోటు పొడుస్తాడని పీకే పవర్ మీద నా అత్యంత మెగా నమ్మకం’ అని వర్మ పోస్ట్ చేశాడు.

అలాగే ఆర్జీవీ మరో ట్వీట్ చేస్తూ… ‘బ్రహ్మంగారు నాకు చెవిలో చెప్పింది, పవన్ కల్యాణ్ గెలిస్తే ఏపీ సీఎం అవుతాడు.. గెలవకపోతే గెలిచిన సీఎంకి మొగుడవుతాడు.. తధాస్తు’’ అని ట్వీట్‌ చేశాడు. మొత్తానికి వర్మ బాబుగారిని బాగానే టార్గెట్ చేశాడు.

సంబంధిత సమాచారం :