నయనతార కు చరణ్ రిక్వెస్ట్ !

Published on Jan 24, 2019 11:40 am IST

లేడీ సూపర్ స్టార్ నయన తార సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉంటుందని ఇండస్ట్రీలో ఎప్పటినుండో టాక్ ఉంది . ముఖ్యంగా తెలుగు సినిమాల ప్రమోషన్స్ కార్యక్రమాలను అస్సలు పట్టించుకోదు. ప్రస్తుతం నయన్ , మెగాస్టార్ చిరంజీవి సరసన సైరా చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రం ఈ దసరా కానుకగా విడుదలకానుంది. ఇక ఈచిత్ర నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల నయనతార కు రిక్వెస్ట్ చేశాడట.

అదేమిటంటే సైరా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొనాలని నయన్ ను అడిగాడట చరణ్. అందుకు నయన్ మొదట ఒప్పుకోలేదట కానీ చరణ్ రిక్వెస్ట్ చేసే సరికి సానుకూలంగా స్పందించిందని సమాచారం. మరి చరణ్ కోరికను మన్నించి నయనతార సైరా ప్రమోషన్స్ కు వస్తుందో లేదో చూడాలి.

సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుంది. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ , విజయ్ సేతుపతి , సుధీప్ , తమన్నా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More