మల్టీస్టారర్లో నటించనున్న నితిన్, రానా ?
Published on Dec 8, 2017 8:58 am IST

ఇటీవలే సీనియర్ హీరో డా.రాజశేఖర్ తో ‘పిఎస్వి గరుడవేగ’ సినిమాను రూపొందించి మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్టును మొదలుపెట్టే పనిలో ఉన్నారు. ముందుగా తెలిపినట్టు ఈ చిత్రం నితిన్ యొక్క హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పై ఉండనుంది. అయితే ఈ చిత్రం మల్టీ స్టారర్ గా ఉంటుందట.

ఇందులో మొత్తం ముగ్గురు హీరోలు నటించడానికి స్కోప్ ఉందని వారి ఒకరు నితిన్ కాగా మరొకరు రానా దగ్గుబాటి అని మూడో హీరో ఎంపికపై చర్చలు జరుగుతున్నాయని సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత మాత్రం వాస్తవముందో తెలియాలంటే సత్తారు, రానా లేదా నితిన్ ఈ ముగ్గురిలో ఎవరో ఒకరి నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.

 
Like us on Facebook