సూపర్ హిట్ తమిళ రీమేక్లో నటించనున్న రవితేజ, రానా !
Published on Oct 26, 2017 8:36 am IST


ఈ ఏడాది తమిళంలో విడుదలై ఘన విజయం అందుకున్న చిత్రాల్లో ‘విక్రమ్ వేద’ కూడా ఒకటి. మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచి ఇద్దరు హీరోలకి మంచి పేరు తీసుకొచ్చింది. దీంతో ఈ సినిమా యొక్క తెలుగు రీమేక్ తెరపైకి వచ్చింది. మొదట నాగార్జున, వెంకటేష్, రానా, మాధవన్ ల పేర్లు వినిపించినా ప్రస్తుతం మరొక కొత్త వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే ఈ రీమేక్లో రాబితేజ, రానాలు నటిస్తారట. సేతుపతి పాత్రలో రవితేజ, మాధవన్ పాత్రలో రానాలు కనిపించబోతున్నారని టాక్. ఒకవేళ ఇదే గనుక నిజమైతే వీరిద్దరూ కూడా ఈ రీమేక్ కు మంచి చాయిస్ అని చెప్పొచ్చు. అయితే ఈ వార్తపై ఇంకా అధికారిక కన్ఫర్మేషన్ ఏదీ బయటకు రాలేదు. తమిళంలో ఈ చిత్రాన్ని పుష్కర్, గాయత్రిలు డైరెక్ట్ చేయగా తెలుగులో ఎవరు చేస్తారనేది తెలియాల్సి ఉంది.

 
Like us on Facebook