వెంకీ చేస్తాడనుకున్న పాత్రను రానా చేయనున్నాడట !


గతంలో వెంకటేష్ గుణశేఖర్ చెప్పిన ‘హిరణ్యకశ్యపుడు’ అనే కథ నచ్చడంతో ఆ సినిమా చేస్తారనే టాక్ బయటికొచ్చింది. కానీ ఇప్పుడు ఆ సినిమాను రానా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి విడుదల తరవాత గుణశేఖర్ రానాకు ఈ కథ వినిపించారని, సాధారణంగానే భిన్నమైన కథల్ని ఇష్టపడే ఆయనకు ఆ కథ, హిరణ్యకశ్యపుడి పాత్ర నచ్చాయని, ప్రాజెక్ట్ పట్ల ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్టుకు భారీ గ్రాఫిక్స్ అవసరమవుతాయని, అందుకే ఎక్కువ సమయం తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో విఎఫ్ఎక్స్ ను డిజైన్ చేయాలని గుణశేఖర్ భావిస్తున్నారట. అందుకోసం సుమారు రూ.10 కోట్ల బడ్జెట్ ను కూడా కేటాయించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. కానీ ఈ విషయమై గుణశేఖర్ నుండి కానీ రానా నుండి ఇంకా ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ బయటకురాలేదు.