తెలంగాణాలో లేని హైక్స్ ఒక్క ఏపీలో ఎందుకు? రానున్న మూడు సినిమాలకి పెంపు!

తెలంగాణాలో లేని హైక్స్ ఒక్క ఏపీలో ఎందుకు? రానున్న మూడు సినిమాలకి పెంపు!

Published on Oct 4, 2026 5:57 PM IST

ఇప్పుడున్న రోజుల్లో థియేటర్ కి ఒక సామాన్య ప్రేక్షకుడు కూడా కుటుంబంతో రాగలిగితేనే ఆ సినిమా తీసినవారు తమ సినిమాకి వచ్చే ప్రేక్షకుడికి గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. మన దగ్గర హై బడ్జెట్ లు పెట్టి సినిమాలు చేస్తున్నారు ఓకే.. అందుకు టికెట్ ధరల పెంపు అంటూ ఓ కొత్త ట్రెండ్ ని తీసుకొచ్చి నార్మలైజ్ చేసేసారు.

ఆ మధ్య అయితే చిన్న, లేదు పెద్ద ప్రతీ సినిమాకి టికెట్ ధరల పెంపు ఇస్తూ జీవోలు తెగ వచ్చేవి. అయితే మెల్లగా ఈ ట్రెండ్ కి తెలంగాణలో చెక్ పడింది. కేవలం కొన్ని సినిమాలకి మాత్రమే హైక్స్ వస్తున్నాయి.కానీ ఏపీలో మాత్రం పరిస్థితి చాలా భిన్నంగా కనిపిస్తుంది. అక్కడ ప్రేక్షకులు అంతా నిరంతర సిరి సంపదలతో ఉన్నారా? అన్నట్టు వరుసగా అనేక సినిమాలకి హైక్స్ ఇస్తూ వచ్చేస్తున్నారు అనే ప్రశ్న సగటు సినిమా లవర్ మదిలో ఉంది.

మన దగ్గర చిన్న చిన్న సినిమాలకే తెలంగాణలో ఇవ్వని హైక్స్ ఏపీలో ఎందుకు ఇస్తున్నారు అనే ప్రశ్న ఒకటి అయితే.. ఇతర భాషల నుంచి వస్తున్న సినిమాలకి ఆ సినిమా తీసిన సొంత రాష్ట్రంలో లేని టికెట్ ధర కంటే ఏపీలో ఎక్కువ ఉండడం, పైపెచ్చు అదనంగా హైక్ లు కూడా అందించడం అనేది ఏపీలో సినిమా ప్రేక్షకులని చాలా అలుసుగా తీసుకుంటున్నారు అనే రీతిలో ప్రొజెక్ట్ చేస్తుంది.

ఇప్పుడు ఈ అక్టోబర్ లో వస్తున్న మూడు సినిమాలు రణబాలి, ఆదర్శ కుటుంబం, జైలర్ 2 ఈ మూడూ తెలంగాణలో సాధారణ టికెట్ ధరలతోనే వస్తుంటే ఒక్క ఏపీలో మాత్రం 50 రూపాయల అదనపు టికెట్ ధరలతో విడుదల కానున్నట్టు తెలుస్తుంది. ఇంట్రెస్టింగ్ గా ఇందులో డబ్బింగ్ సినిమా జైలర్ 2 కి తమిళనాడులో కంటే ఏపీలోనే టికెట్ ధర ఎక్కువ పడుతుంది.

మరి ఈ లెక్కల వెనుక ఉన్న మజిలీ ఏంటి అనేది పైన పెద్దలికే తెలియాలి. పెంచితే రెండు చోట్ల పెంచాలి లేదా రెండు చోట్లా సాధారణ ధరలతోనే ఉండాలి. కానీ ఈ వ్యత్యాసం ఏంటో అని ఆల్రెడీ సోషల్ మీడియాలో మూవీ లవర్స్ మధ్య టాక్ మొదలైపోయింది. ఈ మధ్య కాలంలో చాలా సినిమాల ఫలితాలని ఈ టికెట్ ధరలే డిసైడ్ చేసాయి. సో ఇకనైనా వీటిపై పక్కా నిర్ణయం తీసుకుంటే టాలీవుడ్ కి మంచి రోజులు కొనసాగుతాయి. లేదా మళ్ళీ ఓటిటిలే దిక్కవుతాయి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు