జనవరి 1న విడుదలకానున్న రానా కొత్త సినిమా ఫస్ట్ లుక్ !

‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్త గుర్తింపును సంపాదించుకున్న నటుడు రానా దగ్గుబాటి వరుసగా విభిన్న చిత్రాలకే సైన్ చేస్తున్నారు. వాటిలో ప్రస్తుతం చేస్తున్న ‘1945’ అనే సినిమా షూటింగ్ దశలో ఉండగా ఇంకో సినిమాని లైన్లో పెట్టారాయన. ఆ సినిమానే ‘హాతి మేరే సాతి’. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను జనవరి 1న కొత్త సంవత్సరం సందర్బంగా రిలీజ్ చేయనున్నారు.

ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు ప్రభు సాలమన్ డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందించనున్నారు. కొద్దిసేపటి క్రితమే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ ను చూస్తే సినిమా ఏనుగుల నైపథ్యంలో నడిచే రియలిస్టిక్ స్టోరీగా ఉండనుందని తెలుస్తోంది.