‘రంగస్థలం’ విజువల్ ట్రీట్ అవుతుందన్న చిరు, రాజమౌళి!
Published on Nov 16, 2017 8:42 am IST

రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రంగస్థలం 1985’ పై ప్రేక్షకుల్లో భారీస్థాయిలో అంచనాలున్న సంగతి తెలిసిందే. 1985ల కాలంలో గ్రామీణ నైపథ్యంలో సాగనున్న ఈ చిత్రంలో చరణ్ ను సుకుమార్ ఎంత కొత్తగా చూపిస్తాడో చూడాలని ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో ఇంకొన్ని సీన్స్, నాలుగు పాటలు మాత్రమే మిగిలున్నాయట.

ఇకపోతే ఇప్పటి వరకు తీసిన రషెస్ చూసిన మెగాస్టార్ చిరు థ్రిల్ ఫీలయ్యారట, సినిమా చాలా బాగా వస్తోందని హర్షం వ్యక్తం చేశారట. ఔట్ ఫుట్ ను పరిశీలించిన దర్శక ధీరుడు రాజమౌళి అయితే సినిమా ఖచ్చితంగా వీగిజువల్ ట్రీట్ అవ్వడం ఖాయమని అభిప్రాయాపడ్డారట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత అక్కినేని హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు.

 
Like us on Facebook