నానితో రాశి ఖన్నా స్పెషల్ సాంగ్.. నిజమేనా ?

నానితో రాశి ఖన్నా స్పెషల్ సాంగ్.. నిజమేనా ?

Published on Dec 4, 2022 9:03 AM IST

నేచురల్ స్టార్ నాని హీరోగా ‘దసరా’ అనే మూవీ రాబోతుంది. ఓదెల శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ చిత్రంలో మరో స్పెషల్ సాంగ్ ఉందని తెలుస్తోంది. అయితే, ఈ సాంగ్ లో బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా నటించబోతుందని పుకార్లు వినిపిస్తున్నాయి.

మరి రాశి ఖన్నా – నాని కాంబినేషన్ లో సాంగ్ అంటే.. అదిరిపోతుంది. అందుకే, ఈ రూమర్ వినిపించగానే అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది. సాయి కుమార్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు