అఖిల్ సినిమాలో నటించడం లేదు : రాశిఖన్నా

అఖిల్ సినిమాలో నటించడం లేదు : రాశిఖన్నా

Published on Mar 24, 2015 11:56 AM IST

Rashi-Khanna
‘మద్రాస్ కేఫ్’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన రాశి ఖన్నా, తన తరువాతి సినిమా ‘ఊహలు గుసగుసలాడే’తో తెలుగు తెరకు పరిచయమైంది. అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకోవడంతో తెలుగులో మంచి మంచి ఆఫర్లను కొట్టేసింది. తాజాగా రాశిఖన్నా హీరోయిన్‌గా నటించిన ‘జిల్’ సినిమా ఈనెల 27న విడుదలవుతోంది. గోపిచంద్ హీరోగా నటించిన ఈ సినిమాతో రాధాకృష్ణ దర్శకుడిగా పరిచయం కానున్నారు.

ఈమధ్య కాలంలో జిల్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. ఓ సందర్భంలో ఐటమ్ సాంగ్స్ పట్ల తన అభిప్రాయాలను తెలిపింది రాశిఖన్నా. ఐటమ్ సాంగ్స్ చేయడానికి తనకే అభ్యంతరం లేదని తెలిపింది. మంచి ఆఫర్ వస్తే గనక ఐటమ్ సాంగ్స్‌లో నటించేందుకు సిద్ధమని చెప్పింది. ఇక రాశి ఈ స్టేట్‌మెంట్ ఇచ్చినరోజు నుండే కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌కు నిర్మాతలు ఆమెను సంప్రదిస్తున్నారని వార్తలు బయలుదేరాయి. అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమవుతున్న సినిమాలో ఐటమ్ సాంగ్‌లో రాశి ఆడిపాడనుందని ప్రచారం జరిగింది. అయితే వీటన్నింటినీ రాశి కొట్టి పారేసింది. తానిప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నానని, ఇప్పటికిప్పుడు ఐటమ్ సాంగ్స్ చేసే ఉద్దేశం లేదని తెలిపింది. జిల్ విడుదల తర్వాత రాశి, రవితేజ్ టైగర్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు