అల్లు అర్జున్ ని క్రాస్ చేసేసిన రష్మీ గౌతమ్ !
Published on Nov 30, 2016 11:30 pm IST

rashmi
ఈ మధ్య ఒక సినిమాకి సంబందించిన రికార్డుల్ని లెక్కగట్టేటప్పుడు కలెక్షన్లు, ఆడిన రోజులతో పాటు యూ ట్యూబ్ లోదానికి సంబందిచ్న్హియాం ట్రైలర్స్, పాటలు క్రాస్ చేసిన వ్యూస్ ని కూడా తప్పనిసరిగా లెక్కగడుతున్నారు. ఇప్పుడు ఈ యూ ట్యూబ్ లెక్కలోకి వెళితే ఇప్పటి దాకా మన టాలీవుడ్ లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న పాటగా అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘రేసు గుర్రం’ చిత్రంలోనే ఊరమాస్ పాట అయిన ‘సినిమా చూపిస్తా మామ’ ఇప్పటిదాకా 19,337,012 వ్యూస్ తో రికార్డ్ సృష్టించింది. దీంతో అల్లు అర్జున్ ఖాతాలో ఒక అరుదైన రికార్డ్ భద్రంగా ఉన్నట్టయింది.

కానీ హీరోయిన్ రష్మీ గౌతమ్ ఆ రికార్డుని కొల్లగొట్టేసింది. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ఈ సంవత్సరం ఈమె చేసిన ‘గుంటూరు టాకీస్’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఈ సినిమాలోని మాస్ మసాలా సాంగ్ అయిన ‘నీ సొంతం’ మాస్ జనాన్ని ఒక ఊపు ఊపేసింది. అంట పాపులర్ అయిన ఈ పాట యూ ట్యూబ్ లో ఇప్పటికే 20,308,639 వ్యూస్ సాధించి మెగా హీరోని దాటి ముందు వరుసలో నిలబడింది. పైగా బన్నీ పాట రెండేళ్లలో సాదించిన వ్యూస్ ని రష్మీ పాట కేవలం ఏడాదిలోపే దక్కించుకోవడం మరో విశేషం. ఏది ఏమైనా మరే హీరో క్రాస్ చేయలేని అల్లు అర్జున్ రికార్డ్ ని రష్మీ తన హాట్ పాటతో దాటేసి కొత్త రికార్డ్ నెలకొల్పింది.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook