దుల్కర్, హను రాఘవపూడి సినిమా నుంచి రష్మిక లుక్ రిలీజ్.!

దుల్కర్, హను రాఘవపూడి సినిమా నుంచి రష్మిక లుక్ రిలీజ్.!

Published on Apr 5, 2022 8:02 PM IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి టాలెంటడ్ ఫిల్మ్ మేకర్స్ లో హను రాఘవ పూడి కూడా ఒకరు. తన సినిమాలతో ఆడియెన్స్ ని ఆకట్టుకున్న ఈ సైలెంట్ ఫిల్మ్ మేకర్ లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని చేస్తున్నాడు. మళయాళ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ మరియు నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ని చేస్తున్నాడు.

మరి ఇందులో నుంచి ఈరోజు రష్మికా పుట్టినరోజు కానుకగా మేకర్స్ ఆమె తాలూకా ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. అఫ్రీన్ అనే పాత్రలో ఈమె చేస్తున్నట్టుగా పరిచయం చేశారు. అయితే ఇందులో ఈమె చాలా నాచురల్ గా కనిపిస్తుందని చెప్పాలి. అలాగే పగిలిన కారు అద్దం నుంచి ఆమెని చూపించడం ఆసక్తిగా అనిపిస్తుంది. మరి సినిమాలో తన రోల్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు