సమీక్ష : రథం – రొమాన్స్ ఉన్నా ఇంట్రస్ట్ గా సాగదు

సమీక్ష : రథం – రొమాన్స్ ఉన్నా ఇంట్రస్ట్ గా సాగదు

Published on Oct 26, 2018 3:28 PM IST
 Ratham movie review

విడుదల తేదీ : అక్టోబర్ 26, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : ‘గీతానంద్, చాందిని భాగవానని

దర్శకత్వం : చంద్ర శేఖర్ కానూరి

నిర్మాతలు : రాజా దారపునేని

సంగీతం : సుకుమార్ పమ్మి

సినిమాటోగ్రఫర్ : సునీల్ ముత్యాల

ఎడిటర్ : నాగేశ్వర రెడ్డి

నూతన దర్శకుడు చంద్ర శేఖర్ కానూరి దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన చిత్రం ‘రథం’. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా ‘గీత ఆనంద్, చాందిని భాగవానని జంటగా నటించారు. కాగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో ఒక్కసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..!

కథ :

కార్తీక్ ( గీతానంద్ ) బాగా చదువుకున్నప్పటికీ.. వ్యవసాయం మీద ఆసక్తితో వ్యవసాయం చేస్తుంటాడు. అలాగే తోటివారు ఆపదలో ఉన్న.. వారికి అన్యాయం జరుగుతున్న అడ్డుగా నిలబడి అందరికీ సాయం చేసే మనస్తత్వం ఉన్నవాడు. ఇలాంటి కార్తీక్ లైఫ్ లోకి అనుకోకుండా జరిగిన ఓ సంఘటన కారణంగా బుజ్జి (చాందిని భాగవానని) వస్తోంది. బుజ్జితో కార్తీక్ ప్రేమలో పడతాడు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఇద్దరూ ఒకర్ని ఒకరు ప్రేమించుకుంటారు. బుజ్జి తండ్రి అబ్బులు, కార్తీక్ లాగే తోటివారి కోసం పోరాడి ఇరవై సంవత్సరాలు జైల్లో గడిపి వస్తాడు. తన మంచితనం వల్ల తన భార్య పడిన కష్టాల్ని తలుచుకొని బాధపడతాడు. ఇప్పుడు మళ్లీ కార్తీక్ వల్ల తన కూతురికి అలాంటి పరిస్థితి రాకూడదని వారి ప్రేమకు అడ్డు చెబుతాడు.

ఆ తరువాత జరిగే కొన్ని పరిణామాల కారణంగా అబ్బులు వారి ప్రేమను అంగీకరించి ఓ షరతు పెడతాడు. అసలు అబ్బులు పెట్టిన ఆ షరతు ఏమిటి ? దానిలో కార్తీక్ నెగ్గుతాడా ? బుజ్జి మరియు అబ్బులు కోరుకున్న విధంగా కార్తీక్ మారతాడా ? ఈ క్రమంలో కార్తీక్ కి ఎదురయ్యే సమస్యలు ఏమిటి ?లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడాలసిందే !

ప్లస్ పాయింట్స్:

హీరోగా నటించిన గీతానంద్ లుక్స్ పరంగా, ఫిజిక్ పరంగా ఆకట్టుకున్నే ప్రయత్నం చేశాడు. అయితే కొన్ని కీలక సన్నివేశాల్లో ఎంతో అనుభవం ఉన్న నటుడిలా ఈజ్ తో సెటిల్డ్ గా నటించాడు. ముఖ్యంగా హీరోయిన్ తండ్రితో సాగే సన్నివేశాల్లో గాని, హీరోయిన్ తో రొమాంటిక్ సన్నివేశాల్లో గాని.. అలాగే క్లైమాక్స్ లో కూడా గీతానంద్ నటన ఆకట్టుకుంటుంది.

అల్లరి అమ్మాయి అయిన బుజ్జి పాత్రలో నటించిన హీరోయిన్ చాందిని తన గ్లామర్ తో పాటు, తన ఇన్నోసెంట్ పెర్ఫార్మన్స్ తో.. అచ్చం ఓ పల్లెటూరి అమ్మాయిగా చాలా బాగా నటించింది. రొమాంటిక్ సన్నివేశాల్లో ఆమె పలికించిన హావభావాలు మరియు క్లైమాక్స్ లో ఆమె నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది.

హీరోయిన్ తండ్రిగా నటించిన ఆయన కూడా బాధ్యత గల తండ్రిగా, కథలో కాస్త సీరియస్ నెస్ తో పాటుగా.. కాస్త సెంటిమెంట్ ను కూడా పండించారు. మిగిలిన నటీనటులు కూడా ఉన్నంతలో బాగానే చేశారు. దర్శకుడు కథలో కొన్ని భావోద్వేగ సన్నివేశాలతో ఆకట్టుకున్నే ప్రయత్నం చేశారు. క్లైమాక్స్ కూడా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. హీరో, హీరోయిన్ల మధ్యన వచ్చే ఘర్షణ తాలూకు సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకున్నే విధంగా ఉండవు. దీనికి తోడు సినిమాలోని కీలక సన్నివేశాలు కూడా మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి.

పైగా హీరో హీరోయిన్ల మధ్య అవసరానికి మించి మాస్ మసాలా సన్నివేశాలు, ముద్దులు ఎక్కువైపోయాయి. హీరో క్యారెక్టరైజేషన్ కూడా హీరోగా నటించిన గీతానంద్ కి అంతగా సూట్ అవ్వలేదు. దానికి తోడు ఓవర్ బిల్డప్ షాట్స్.. ఓవర్ ఫైట్స్ కూడా ప్రేక్షకులను కొంత అసహనానికి గురి చేస్తాయి.

ఇక దర్శకుడు తీసుకున్న థీమ్ బాగుంది గాని.. ఆ థీమ్ కి తగ్గ కథ కథనాలు లేకపోవడం, చాలా సన్నివేశాలు ఆసక్తికరంగా సాగకపోవడం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు చంద్ర శేఖర్ కానూరి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా సినిమాని మలచలేకపోయారు.
సంగీత దర్శకుడు సుకుమార్ పమ్మి అందించిన నేపధ్య సంగీతం ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. ఆయన అందించిన పాటలు కూడా కొన్ని ఆకట్టుకున్నాయి. మెయిన్ గా ‘పడి పో’ పాట బాగుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్లే సాగుతుంది. సినిమాలోని నిర్మాణ విలువ‌లు బాగానే ఉన్నాయి.

తీర్పు :

దర్శకుడు చంద్ర శేఖర్ కానూరి దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ‘రథం’ ఆసక్తికరంగా సాగలేదు. కాకపోతే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు, హీరో హీరోయిన్ల మధ్య సాగే లవ్ స్టోరీ, వారి మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. అలాగే క్లైమాక్స్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక మిగిలిన చాలా సన్నివేశాలు ఆసక్తికరంగా సాగకపోగా విసిగిస్తాయి. దీనికి తోడు కథనం కూడా మరి సినిమాటిక్ గా సాగుతుంది. ఈ చిత్రం ‘సి’ సెంటర్ ప్రేక్షకులను మెప్పిస్తోంది. మరి మిగిలిన వర్గాల ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.
123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు