ఎట్టకేలకు కొత్త సినిమాను మొదలుపెట్టేసిన రవితేజ!
Published on Feb 3, 2017 9:26 am IST


‘బెంగాల్ టైగర్’ విడుదలై సంవత్సరం దాటాక కూడా రవితేజ తన కొత్త సినిమాను మొదలుపెట్టకపోవడం ఆయన అభిమానులను తీవ్రంగా నిరుత్సాహపరుస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ గ్యాప్‌కు తెరదించేసిన ఆయన ‘రాజా ది గ్రేట్’, ‘టచ్ చేసి చూడు’ అంటూ రెండు సినిమాలను అనౌన్స్ చేయడంతో పాటు, నేడు ‘టచ్ చేసి చూడు’ను సెట్స్‌పైకి కూడా తీసుకెళ్ళారు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను వల్లభనేని వంశీ, నల్లమలుపు శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.

నేడు హైద్రాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలైంది. రవితేజ సరసన లావణ్య త్రిపాఠి, రాశిఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా నేటినుంచి నిరంతరాయంగా జరగనుంది. తన కెరీర్‌ను మళ్ళీ గాడిలో పెట్టే పెద్ద హిట్ కొట్టాలన్న ఆలోచనతోనే చాలా సమయం తీసుకొని రవితేజ ఈ రెండు సినిమాలను అనౌన్స్ చేశారట. బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ ఈ సినిమాకు పనిచేస్తూ ఉండడం విశేషంగా చెప్పుకోవాలి.

 
Like us on Facebook